పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించాలి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు నీరటీ భాను ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును సిబిఐ కి అప్పగించాలని స్థానిక బస్టాండు నుండి తహసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తహాసిల్దార్ జయంత్ కుమార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటిపల్లి అంజయ్య హాజరై మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును సిబిఐకి అప్పగించాలని, టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని విధులనుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కేటీఆర్ పిఏ అయినటువంటి తిరుపతి రెడ్డి కి పేపర్ లీకేజీ వ్యవహారం లో కీలకమైన వ్యక్తి ప్రవీణ్ """/" /
తన సొంత గ్రామం వాడని దానిపై కూడా దర్యాప్తు చేయాలని వారు అన్నారు.
అలాగే ఇద్దరి నిందితులు అని కేటీఆర్ చెప్తున్నారంటే దానికి కల్వకుంట్ల కుటుంబం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో ప్రధాన పాత్ర వహించిందని అనుమానాలు కూడా ఉన్నాయి .
ఈ కోణంలో కూడా దర్యాప్తు జరగాలని పేపర్ లీకేజీ వ్యవహారంలో ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా చట్టరీత్యా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కార్యదర్శులు గునుగంటి చిరంజీవి, బొడ్డు కిషన్, తాటిపల్లి అజిత్, మండల కోశాధికారి కొప్పెల్లి రాజు, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డమీద సాయి చందు, మండల యూత్ నాయకులు నవీన్ బాయ్ తదితరులు ఉన్నారు.
సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ కాంబో లో సినిమా రాబోతుందా..? బ్యాక్ డ్రాప్ ఏంటంటే..?