బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయ వారసుడి ప్రకటన..!
TeluguStop.com

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు.ఈ మేరకు తన రాజకీయ వారసత్వాన్ని మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కొనసాగిస్తారని తెలిపారు.


లక్నోలో నిర్వహించిన బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో మాయావతి వారసుడిని ప్రకటించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ఆకాశ్ ఆనంద్ గొప్ప నాయకుడిగా ఎదుగుతారని చెప్పారు.


అయితే 2019లో ఆకాశ్ ఆనంద్ బీఎస్పీలో చేరారు.ఈ క్రమంలోనే 2017 యూపీ ఎన్నికలతో పాటు 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ మాయావతి వెన్నంటే ఉన్నారు.
అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన స్వాభిమాన్ సంకల్ప్ యాత్రలో సైతం ఆనంద్ కీలక పాత్ర పోషించారు.
ధనుష్ తెలుగు హీరోగా మారిపోతున్నాడా..?