బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం..: కేసీఆర్

జనగాం జిల్లా చేర్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని తెలిపారు.

ప్రజల చేతిలో ఉండే ఆయుధం ఓటన్న కేసీఆర్ ఓటు ప్రజల తలరాతను మార్చుతుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో.పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో అన్న అంశంపై చర్చ పెట్టాలని చెప్పారు.

గతంలో తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ అని విమర్శించారు.ఈ క్రమంలో అభ్యర్థులతో పాటు పార్టీ చరిత్రను తెలుసుకుని ప్రజలు ఓటు వేయాలని సూచించారు.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?