బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం..: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

సింగరేణి తెలంగాణ కొంగు బంగారమన్న కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదని తెలిపారు.

సమైక్య పాలనలో కేంద్రం నుంచి అప్పులు తెచ్చి కాంగ్రెస్ హయాంలో కేంద్రానికి 49 శాతం వాటా కట్టబెట్టిందన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సింగరేణి లాభాల బాట పట్టిందని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రజలే గమనించాలని సూచించారు.

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని స్పష్టం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 4, బుధవారం 2024