తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

అసెంబ్లీలో హామీలు ఇస్తారు కానీ అమలు చేయారంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం, మంత్రులు తమను కలవరన్నారు.ఇష్టం వచ్చినట్లు బీఏసీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.

గత 25 ఏళ్లలో ఇటువంటి సభను చూడలేదని వ్యాఖ్యనించారు.అనంరతం అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

సభ్యులకు అనుగుణంగా సమయం ఇస్తారని చెప్పారు.ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న ఎంఐఎంకు ఇంత సమయం ఇస్తారా అని ప్రశ్నించారు.

సభా నాయకుడు రాకపోతే ఓవైసీకి ఏం సంబంధమని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.