100% ప్రయత్నిస్తున్న బారాస!
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) లో గెలుపోటములను పక్కన పెడితే ప్రయత్నిస్తున్న విధానంలో మాత్రం భారతీయ రాష్ట్ర సమితికి నూటికి నూరు మార్కులు పడతాయని చెప్పవచ్చు .
ఇప్పటికే రెండుసార్లు తెలంగాణను పరిపాలించిన పార్టీగా మూడోసారి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్న అంచనాలు ఉండడంతో ఈసారి గెలవడానికి ప్రత్యేకవ్యూహాలు అమలు చేస్తున్న బారాస అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటుంది.
అంతేకాకుండా ఇప్పటివరకు తెలంగాణలోని వివిధ వర్గాల ఓట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బి ఆర్ ఎస్( BRS Party ) ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చి సెటిల్ అయిన వారి ఓట్ల పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.
"""/" /
ప్రాంతాలవారీగా సామాజిక వర్గాల వారీగా ఆయా వర్గాలతో సమావేశమై తమకు మద్దతు తెలిపేలా చక్రం తిప్పుతుందట.
ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad ) గ్రేటర్ సిటీ కావడంతో ఇక్కడ దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు.
వారంతా ఓటు హక్కు ను కూడా హైదరాబాద్ కేంద్రంగా మార్చుకొని ఉండడంతో ఇప్పుడు ఆయా ఓట్లు కీలకంగా మారుతాయి అని అంచనా వేస్తున్న అధికార బారాస ఇప్పుడు ఆయా వర్గాల ఓట్లను సాధించడం కోసం ప్రయత్నాలను చేసినట్లుగా కనిపిస్తుంది .
"""/" /
ఇప్పటికే ఆంధ్ర సెటిలర్ల ఓట్లను దక్కించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేసిన బారాస ఆ ప్రయత్నంలో చాలావరకు విజయవంతమైనదని చెబుతున్నారు.
ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఓట్లను కూడా వదలకూడదు అన్న కృత నిశ్చయం తో బీఆరఎస్ నేతలు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు .
తక్కువ శాతమే కదా అని ఈ వర్గాన్ని లైట్ తీసుకోకూడదని ఓటు హక్కు ఉన్న అందరిని కవర్ చేయాలన్న పట్టుదల అధికార పార్టీ ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది.
పలితం కన్నా ప్రయతించే విదానం గొప్పది అంటారు .మరి బారతీయ రాష్ట్ర సమితి తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది.
సుకుమార్ కూతురును మెచ్చుకున్న రామ్ చరణ్ దంపతులు.. అసలేం జరిగిందంటే?