బీఆర్ఎస్ టూ కాంగ్రెస్.. కాంగ్రెస్ టూ బీఆర్ఎస్ ! గద్వాల ఎమ్మెల్యే కు బుజ్జగింపులు

ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) కు పెద్ద చిక్కే వచ్చి పడింది .

  ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో దాదాపు పది మంది వరకు ఎమ్మెల్యేలు చేరారు.

  అయితే అలా చేరిన వారిలో చాలామంది కాంగ్రెస్ లో  ఏమడ లేక పోతూ ఉండడం, తమకు సరైన గౌరవ , మర్యాదలు లభించడం లేదని,  పార్టీలో చేర్చుకునే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.

  తమను చిన్న చూపు చూస్తున్నారనే కారణాలతో చాలామంది అసంతృప్తితో ఉండగా , ఒక అడుగు ముందుకు వేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ( Bandla Krishnamohan Reddy )మళ్ళీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది .

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి బండ్ల గద్వాల నుంచి పోటీ చేశారు.

కేసిఆర్( KCR ) కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.  అయితే కొద్ది రోజుల క్రితమే ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

"""/" / అయితే అక్కడ పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడం,  మరే ఇతర కారణాలతోనో మళ్ళీ కేటీఆర్( KTR ) ను కలిసి తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించడం కాంగ్రెస్ లో సంచలనం సృష్టిస్తోంది.

కేవలం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో పాటు,  చాలామంది ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారనే విషయం తేలడం తో స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో నిమగ్నం అయ్యారు.

ఈ మేరకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్సి , ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి ( Narender Reddy )తో కలిసి మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.

  తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు.

"""/" / బీఆర్ఎస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో,  కృష్ణమోహన్ రెడ్డిని బుద్ధగించేందుకు జూపల్లి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కలిశారు.

ఈ సందర్భంగా తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఈరోజు జూపల్లి కృష్ణారావు బండ్ల నివాసానికి వెళ్లారు.

యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారా..?