అక్కడ కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలా బీఆర్ఎస్ వ్యూహం 

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ ( BRS )రోజురోజుకు బలహీనం అవుతోందన్న సంకేతాలు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరిపోవడంతో  క్యాడర్ గందరగోళం లో ఉంది .

ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు బీఆర్ఎస్ కాళీ అయ్యే పరిస్థితి నెలకొంటుందని , దానికి అడ్డుకట్ట వేయాలని కెసిఆర్ భావిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా కాంగ్రెస్ ముందుకు వెళుతూ ఉండడం,  రైతు రుణమాఫీ ( Farmer Loan Waiver )అమలు చేయడంతో కాంగ్రెస్ మంచి జోష్ లో ఉంది .

ఈ నేపథ్యంలోనే మిగిలిన వైఫల్యాల పైన ఫోకస్ చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది.

"""/" / ఈ మేరకు నిరుద్యోగ,  ప్రజా,  రైతు సమస్యలు,  ఎన్నికల హామీలపై నిలదీయడంతో పాటు,  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబట్టేందుకు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను నిలదీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.

అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు కావడంతో, ఈ వ్యూహాన్ని అమలు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై మరింత స్పీడ్ పెంచి క్యాడర్ లో జోష్ నింపడంతో పాటు,  స్థానిక సంస్థల ఎన్నికలకు వారిని సిద్ధం చేయాలని కెసిఆర్ ( KCR )భావిస్తున్నారు.

  అసెంబ్లీ,  మండలి లో ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కెసిఆర్ వారికి దిశా నిర్దేశం చేయబోతున్నారట.

ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించేందుకు వ్యూహం రచిస్తున్నారు .రైతు భరోసాను ఎప్పటిలోగా ఇస్తారు,  రెండు లక్షల రుణమాఫీ ఎంత మందికి ఇస్తున్నారు అనే లెక్కలను బయటకు తీసి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.

"""/" / రైతు బీమా , 500 మద్దతు ధర వంటి అంశాలను రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.

  అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత రేటుకు పట్టు పట్టేందుకు అసెంబ్లీ వేదికగా ప్లాన్ చేస్తోంది.

అలాగే దీనిపై హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది .

అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలను ప్రచారం చేయాలని కేడర్ కు కెసిఆర్ సంక్షేత్రాలు ఇవ్వబోతున్నారు.

మీడియా , సోషల్ మీడియాలో వీటిని హైలెట్ చేయాలని భావిస్తున్నారు.మొత్తంగా అన్ని రకాలుగా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

బిగ్ బాస్ కి వెళ్తే కెరియర్ పిప్పి కావాల్సిందే.. దండం పెట్టేసిన యూట్యూబర్!