బీఆర్ఎస్ సంక్రాంతి టాస్క్ ? ఏపీనే టార్గెట్ ? 

తెలంగాణ తర్వాత ఏపీ పైనే బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.ఏపీలో తమ పార్టీని విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ బలంగా నమ్ముతున్నారు.

అందుకే మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారు.

రాబోయే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దాలని కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు .

      అందుకే తెలంగాణతో పాటు ఏపీలోనూ మరింత పట్టు పెంచుకోవాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.

దీనిలో భాగంగానే ఏపీలో పెద్ద ఎత్తున చేరుకలను ప్రోత్సహించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.ప్రస్తుతం సంక్రాంతి పండుగ ఏపీలో కోలాహలంగా జరుగుతుండడంతో,  దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసిఆర్ సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఏపీకి సంక్రాంతి పండుగ నిమిత్తం వెళ్లడం అనువాయితి.

తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లోనూ స్థిరపడిన వారంతా ఈ సంక్రాంతికి ఏపీలో సొంతూళ్ళకు, బంధువులు వద్దకు వెళుతుంటారు.

ఈ సందర్భంగా వారందరి దృష్టి బీ ఆర్ ఎస్ పై పడేలా చేయాలని , కుల సంఘాలతో చర్చలు జరిపి ఆయా సంఘాలను తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహానికి ఇప్పటికే కేసీఆర్ తెర తీశారు.

    """/"/   ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు చాలామంది కుల సంఘాల నాయకులతో మాట్లాడుతున్నట్లు సమాచారం.

భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరికలను ఆయా కుల సంఘాల ద్వారా వారిని ఒప్పించినట్లు తెలుస్తోంది.

తాము ఏపీలో అధికారంలోకి వస్తే మీ కులానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, ఎక్కడికక్కడ కమ్యూనిటీ హాల్ లను నిర్మిస్తామని,  కులవృత్తులను ప్రోత్సహించడం తో పాటు , ఆ కులాలకు ఉపయోగపడే విధంగా భవనాలను కట్టిస్తామంటూ హామీలు ఇస్తున్నారట.

ఇప్పటికే తెలంగాణకు చెందిన కుల సంఘాల నాయకులు ఏపీలోని తమ కుల సంఘాల నాయకులతో ఈ విషయమై చర్చలు జరుపుతున్నారట.

ముఖ్యంగా బీసీ సంఘాల పైన బీఆర్ఎస్ ఎక్కువగా పోకస్ పెట్టినట్లు సమాచారం .

  """/"/      అలాగే కాపు సామాజిక వర్గానికి తెలంగాణలో తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, ఏపీలోనూ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఆయా కుల సంఘాలకు చెందిన నేతలతోనే ఏపీ కుల సంఘాల నేతలకు చెప్పిస్తున్నరట.

తెలంగాణలోని కుల సంఘాల నాయకులతోనే ఏపీలోని కుల సంఘాల నాయకులతో చర్చలు జరిపిస్తూ బీఆర్ఎస్ వైపుకు వారందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట.

గత కొద్ది రోజులుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు వర్కవుట్ అవుతున్నట్టే కనిపిస్తుండడంతో, బీఆర్ఎస్ నేతల్లో ఆనందం కనిపిస్తోంది.

ఈ హీరోయిన్స్ అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారా..??