తెలంగాణ పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ రిపోర్ట్

తెలంగాణ పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ రిపోర్ట్ విడుదల చేసింది.తెలంగాణ ఆస్తుల పేరుతో సుమారు 51 పేజీలతో రిపోర్ట్ ను బీఆర్ఎస్ రిలీజ్ చేసింది.

ఈ క్రమంలోనే డిపార్ట్ మెంట్ల వారీగా పదేళ్లలో సృష్టించిన ఆస్తులు, అభివృద్ధిపై నివేదిక ఇచ్చింది.

ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి ముందే బీఆర్ఎస్ రిపోర్టును విడుదల చేసింది.ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక ఘట్టం ఆవిశ్కృతం కానుంది.

అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

తరువాత శ్వేతపత్రం రిలీజ్ చేయనున్న నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడీవేడిగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరికాసేపటిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా సంతాప తీర్మానాలు అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు - శ్వేతపత్రంపై లఘు చర్చ జరగనుంది.

పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్… నాని ఇంట్రెస్టింగ్ పోస్ట్!