టిఆర్ఎస్ పార్టీ నుండి రెడ్డి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి రెడ్డి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

రెడ్డి సంఘం అధ్యక్షులు చల్ల మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కట్ట గురవ రెడ్డి, సభ్యులు కరుణాకర్ రెడ్డి, మారుపాక నరసింహ చారి మొత్తం 40 మంది కార్యకర్తలు బుధవారం రోజున డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇందులో కాంగ్రెస్ జిల్లా నాయకులు చీటీ ఆనంద రెడ్డి, మండల అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు ఎలగందుల ప్రసాద్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తేనెతో నిద్రలేమి ఇక దూరం..!