వీటి సంగతేంటి ? కూల్చివేతలపై బీఆర్ఎస్ ఫైర్

హైదరాబాద్( Hyderabad ) నగర పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు, అలాగే ఆక్రమణకు గురైన చెరువులను మళ్లీ పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా '( Hydra ) పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ రాజకీయ దడలు పుట్టిస్తోంది.

చెరువులను ఆక్రమించుకున్న అక్రమ కట్టడాలను( Illegal Constructions ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూల్చివేస్తున్నారు.

ఈ కూల్చివేత కార్యక్రమంలో ఎవరు ఏ స్థాయిలో ఒత్తిడి చేసినా తగ్గేదే లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఈ కూల్చివేతలలో ఎక్కువ బీఆర్ఎస్ కు చెందిన నేతల కట్టడాలు ఉండడంతో,  దీనిపై బీఆర్ఎస్( BRS ) అనేక విమర్శలు చేయడమే కాకుండా,  కాంగ్రెస్ ప్రభుత్వం పైన కౌంటర్లకు దిగుతోంది.

ఈ మేరకు రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నేతలు హైడ్రా అధికారులపై ఒత్తిడి పెంచేందుకు అన్ని రకాలుగాను సిద్ధం అయ్యారు.

"""/" / హిమాయత్ సాగర్ బఫర్ జోన్లలో ఎవరెవరికి ఫామ్ హౌస్ లు ఉన్నాయి అనేది గూగుల్ మ్యాప్ ద్వారా బయటకు తీసి వాటి సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

  ఈ మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి ప్రశాంత్ అదే పనిగా కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ గూగుల్ మ్యాపులు బయటకు తీసి వాటిని ఎప్పుడు కూల్చుతారంటూ బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ బయట పెడుతున్నారు.గూగుల్ మ్యాప్ లలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలవే కాకుండా , """/" / ఇంకా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా అధికారులు చేయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) ఫామ్ హౌస్,  అలాగే కాంగ్రెస్ కీలక నేతలు, వ్యూహకర్త కెవిపి రామచంద్రరావు( KVP Ramachandra Rao ) ఫామ్ హౌస్ ల విషయం పైన బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతోంది.

బీఆర్ఎస్ నాయకులకు చెందిన ఫామ్ హౌస్ లో కూలుస్తారు అన్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు కూడా అక్కడ ఫామ్ హౌస్ లు ఉన్నాయని , వాటిని కూడా కూల్చాలని డిమాండ్ ను వినిపిస్తూ మీడియా,  సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు ఒకే కానీ మిగతా యంగ్ హీరోలు సక్సెస్ కొట్టకపోతే కష్టమేనా..?