నేడు అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ప్లీనరీలు !  

తెలంగాణ అధికార పార్టీ బీ ఆర్ ఎస్( BRS Party ) స్పీడ్ పెంచింది .

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో,  పూర్తిగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఆ పార్టీ అధినేత కెసిఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలు,  నియోజకవర్గాల వారీగా కెసిఆర్ తో పాటు,  పార్టీ కీలక నాయకులంతా పర్యటనలు చేశారు.

బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తూ పై చేయి సాధించే ప్రయత్నం చేశారు.

ఇక ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు  జరగబోతున్నాయి.

ప్రతి సభలోను మూడు వేల నుంచి 3500 మంది కార్యకర్తలు,  పార్టీ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.

"""/" / రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు దేశాన్ని నిర్దేశం చేసేందుకు,  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సభల నిర్వహణ వంటి విషయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సూచించారు.

ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సభలో తెలంగాణ సాధించిన విజయాల పైన , కేంద్ర అధికార పార్టీ బిజెపి వైఫల్యాల పైన తీర్మానాలు చేయబోతున్నారు.

అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( K.T.

Rama Rao )ఇప్పటికే  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దీనిపై తగిన సూచనలు చేశారు.

"""/" / రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది నేడు జరగబోయే సభలో పాల్గొననున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈరోజు జరిగే బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో కనీసం ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు.

"""/" / ఈనెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహించబోతున్నారు.

దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్( CM Kcr ) అధ్యక్షత వహించబోతున్నారు.

రాష్ట్ర,  జాతీయ పరిస్థితులపై తీర్మానాలను ప్రవేశపెట్టి వీటిని ఆమోదించనున్నారు .ఇక ఎన్నికల వరకు ఇదే స్పీడ్ కొనసాగించి కాంగ్రెస్ బిజెపి లకు ఎక్కడా అవకాశం ఉందకుండ చేసేందుకు కేసిఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు .

ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి వల్ల ప్రజలకు చేకూరిన లబ్ధి, మూడోసారి అధికారంలోకి వస్తే ఏ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తాము అనే విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ సభల ద్వారా బీఆర్ఎస్ ప్రతినిధులకు తగిన సూచనలు అందించనున్నారు.

మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ ఇప్పుడు పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది.

మీకు ఇదేం సరదా రా బాబు.. కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు గాల్లోకె..