ఏపీలో త్వరలో ప్రారంభంకానున్న బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి.ఈ మేరకు వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం రూపకల్పన చేస్తోందని సమాచారం.

ఏపీ వ్యాప్తంగా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.ఈ క్రమంలో సభ్యత్వ నమోదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ పనులు జరగనున్నాయి.అంతేకాకుండా జనవరి చివరిలో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నారు.

అమరావతిలో పార్టీ భవన నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.

అప్పటివరకు తాత్కాలిక కార్యాలయం నుంచి పార్టీ కార్యక్రమాలు ప్రారంభించే విధంగా నేతలు ప్రణాళికను రూపొందించారు.

ఈనెల 26 లేదా 27న ఏపీకి చెందిన కొందరు నేతలు కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Elon Platform Overview And Key Features For UK Players