మొక్కలు నాటిన భిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు.

కోటి వృక్షార్చన కార్యక్రమం ( One Crore Tree Planting Program )లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో మిడ్ మానెరు పల్లె పకృతివనం వద్ద మొక్కలు నాటిన బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు( BRS Party Leader Joginapally Ravinder Rao ), ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.హరితహారంలో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చ‌న కార్యక్రమం అద్భుతమైనది అని కొనియాడారు.

ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు.హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం ఏర్పడింది.

సకాలంలో వర్షాలు పడుతుండ‌టంతో ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉన్నారు.హరితహారం కార్యక్రమం( Haritha Haram Program ) వల్ల రాష్ట్రంలో 7.

7 శాతం గ్రీనరీ పెరిగింది.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి పాటుపడాలనీ విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి ,ఎంపిడిఓ నల్ల రాజేందర్ రెడ్డి, బిఅర్ఎస్ జిల్లా నాయకులు అనుముల భాస్కర్ రెడ్డి, మండల నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈఫిల్ టవర్ దగ్గర అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఇండియన్.. వీడియో చూస్తే..