ఎన్నికల ప్రచారంలో కవితక్కను దూరం పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ..కారణం..?

బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తున్న వారిలో కెసిఆర్, కేటీఆర్,హరీష్ రావు( KCR, KTR, Harish Rao ) తర్వాత కవిత అని చెప్పుకోవచ్చు.

కేసిఆర్ తనయిరాలుగా రాజకీయాల్లో దిట్ట.ఈమె తన మాటల గారడీ తో అందరిని మభ్యపెడుతుంది.

మరీ ముఖ్యంగా తండ్రి ఎలాంటి రాజకీయ చతురతతో అయితే మాట్లాడుతూ జనాలను అట్రాక్ట్ చేస్తాడో అలాగే కూతురికి కూడా అలాంటి గుణాలే వచ్చాయి.

ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించి మహిళామణులందరితో బతుకమ్మ ఆడించి అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇక గత రెండు పర్యాయాలు ఎన్నికలలో కవితక్క బీఆర్ఎస్ పార్టీకి ఊపిచ్చింది.కానీ ఈసారి మాత్రం కవితక్కని బీఆర్ఎస్ పార్టీ ( BRS Party )దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.

మొదటి రెండు సార్లు ఎన్నికల్లో కవితక్కకు మంచి ప్రియారిటి ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఈ ఎన్నికల్లో ఆమె గ్రాఫ్ పడిపోయినట్టే తెలుస్తోంది.

దానికి ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పేరు ప్రధానంగా వినిపించడమే.

ఇక లిక్కర్ స్కాం( Liquor Scam ) లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరీ ముఖ్యంగా కేసీఆర్ తనయిరాలు పేరు గట్టిగా వినిపించడంతో ఈమెను ఈసారి ఎన్నికల్లో దూరం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తుందట.

"""/" / ఎందుకంటే ప్రస్తుతం కవితపై రాష్ట్రంలో ఎదురు పవనాలు వీస్తున్నాయి.అలాగే నిజామాబాదులో ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు పసుపు రైతులందరూ ఈమెపై ఏకధాటిగా నామినేషన్లు వేసి అక్కడ ఓడించి ఎంపీ పదవి నుండి తొలగించారు.

కానీ కేసిఆర్ తన కూతురికి ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టారు.ఇక గత కొన్ని రోజుల నుండి ఈమె గ్రాఫ్ పడిపోవడంతో ఈసారి ఎన్నికల్లో ఈమె ప్రచారంలో పాల్గొనక పోవడమే మంచిది అని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుందట.

ఒకవేళ ప్రచారంలో పాల్గొంటే కవితపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని,ఈ కారణంతో బీఆర్ఎస్ పార్టీకి మైనస్ జరుగుతుంది అనే ఉద్దేశంతో కేవలం కవితక్కను నిజామాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తుందట.

దాంతో ఈ విషయం నేతలందరూ చర్చించుకోవడంతో కవితక్కను ఎన్నికల ప్రచారానికి దూరం పెడుతున్నారు అంటూ ఒక వార్త మీడియాలో వైరల్ గా మారింది.

జుట్టు రాలే సమస్యతో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టేయండి..!