పది ఏళ్లుగా రైతులను మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ – ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల : రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ రైతును రాజుగా చేసింది, చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పదేళ్లు అధికారంలో ఉండి రైతులను పట్టించుకోలేని ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని, ఇప్పుడు రైతు పక్షపాతిగా మొసలి కన్నీరు కారుస్తూ కే సీ ఆర్ కొత్త డ్రామాకు తెరలే పాడని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు.

శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.

ప్రతిపక్ష నేత మాజీ మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయిన బాధలో మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ జిక్కుల మారిన పరిపాలన తెలంగాణ ప్రజలు పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు.

అధికారం కోల్పోయిన బాధలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని దీని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

10 సంవత్సరాల కాలంలో వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు సాయం చేయలేదని, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది, వరంగల్లో రైతులపై లాఠీ ఛార్జ్ చేసిన చరిత్ర కెసిఆర్ ది, పంట నష్టపోయిన రైతులకు 10 వేల రూపాయలు సహాయం చేస్తానని జీవో తీసి నష్టపరిహారం ఇవ్వని కెసిఆర్ రైతుల గురించి మాట్లాడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు దీక్షలు చేస్తున్నారని, వారు అధికారంలో ఉన్నప్పుడు దీక్ష చౌకు ఎత్తివేసి, ప్రశ్నించే గొంతుకులను నొక్కి వేసిన మీరు రైతుల పక్షాన దీక్షలు చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.

10 సంవత్సర కాలంలో కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేపించే కేటీఆర్ రైతుల పక్షాన దీక్షలు చేయడమా, మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు.

వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్, ఈనాడు రైతుల పక్షాన దీక్షలు చేయడం కేసీఆర్,కేటీఆర్ లో కలిసి కొత్త డ్రామాకు తెర తీసారని అన్నారు.

పదివేల మందితో మేడిగడ్డకు వెళ్తాను అన్నకేసీఆర్ , మీరు అధికారంలో నే కదా కాళేశ్వరం పిల్లర్లు కృంగిపోయాయి , అప్పుడు అధికారంలో ఉన్న మీరు కాళేశ్వరం ఎందుకు రిపేరు చేయలేదు అని ప్రశ్నించారు.

కాలేశ్వరం పేరు మీద 98 వేళ కోట్లు మాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు.

కృంగిన పిల్లర్లు చూద్దామని మేడిగడ్డకు మేమే రమ్మని చెప్పాము,మీరు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు.

ఆరోగ్యం బగలేకపోతే ప్రత్యేక హెలికాప్టర్ బేగంపేట లో సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ఆరంజ్ చేసినా రాని కెసిఆర్ మా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నావా అని అన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని,కే సీ ఆర్ కట్టిన కాలేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లకే కూలిపోయిందని అన్నారు.

మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్ల నేతన్నల బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోయారు,నేతన్నల పాత బకాయిలు ఆపిన పాపం కేసీఆర్ కేటీఆర్ లదని అన్నారు.

ఆసాముల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే వారి సమస్యలు పరిష్కరించి, ఉపాధి కల్పిస్తామని అన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు కేసీఆర్, మీరు ఏం చేశారురా అని అడగొచ్చు, కానీ సభ్యత అడ్డు వస్తుంది, అయినా మేము ఆ భాష మాట్లాడమని అన్నారు.

తల్లి సోనియా గాంధీ మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణను, 6 లక్షల 71 వేళ కోట్ల అప్పు చేసింది ఎవరు, మీరు కదా కేసీఆర్,రాష్ట్రాన్ని సీఎం రేవంత్ సర్దుకు పోతుంటే కే సీ ఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు.

రైతును రాజు చేసింది, చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అని,రైతులను పదేళ్లుగా మోసం చేసింది బి ఆర్ ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు.

ప్రజలు ఆల్రెడీ కెసిఆర్ ప్రభుత్వాన్ని పండబెట్టి తొక్కిన ఇంకా బుద్ధి రావడం లేదు అని,కేసీఅర్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, ప్రకాష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికైనా మారకపోతే కష్టం రామ్.. అలాంటి సినిమాలు నీ ఇమేజ్ కు అవసరమా?