ఏపీకి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టం – బీఅర్ఎస్ పార్టీ ఏపి అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్
TeluguStop.com
గుంటూరు జిల్లా: ఉండవల్లి దేవుని మాన్యంలో మహా మృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీఅర్ఎస్ పార్టీ ఏపి అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్.
తోట చంద్ర శేఖర్ కామెంట్స్.కేసీఆర్ పవన్ కళ్యాణ్ కి 1000 కోట్లు ఆఫర్ చేశారని చెప్తున్న వారి దిగజారుడుతనానికి అర్థం పడుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
దేశంలో రైతాంగ సమస్యలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదు.ఏపీ కి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టం.
బీఅర్ఎస్ పార్టీ అన్నీ రాష్ట్రాలలో విస్తరిస్తుంది.ముఖ్యమైన రైతాంగ సమస్యల పై బిఆర్ఎస్ దృష్టి పెడుతుంది.
"""/" /
నిరుద్యోగం,ధరల నియంత్రణ లేకపోవడం ప్రధానంగా ఉన్నా సమస్యలు.కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విభజన హామీలను సాధించుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనలో వైసిపి,టిడిపి పార్టీలు విఫలం అయ్యాయి.పెద్ద పార్టీల లీడర్ల ను అవహేళన చేసే అభియోగాలు మోపడం తగదు.
పొత్తులు ఏ పార్టీతో అయినా పెట్టుకోవచ్చు.పొత్తు మేము పెట్టుకుంటే సంసారం ఇతరులు పెట్టుకుంటే వ్యభిచారం అన్నట్టు మాట్లాడడం సరికాదు.
పొత్తు కోసం కేసీఆర్ డబ్బు ఆఫర్ చేశారని అభియోగాలు చేయడం వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసినట్టు అవుతుంది.
దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం బీఅర్ఎస్ పార్టీ.
వైరల్: చలికాలంలో కురాళ్లకు హీటేక్కిస్తున్న యువతి.. ఏం చేస్తోందో చూడండి!