బీఆర్ఎస్ కొత్త పథకం..ఏకంగా 30 లక్షల సాయం..ఎవరికంటే..?

ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఎప్పుడు కనిపించని నాయకులంతా ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి వెళుతూ ఉంటారు.

అంతేకాకుండా ప్రజలకు వరాల జల్లు కూడా కురిపిస్తారు.వివిధ రకాల పథకాల పేరుతో ప్రజలను మెస్మరైజ్ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ పార్టీల నాయకులు.

ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇంకో రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి.దీంతో అన్ని పార్టీల నాయకులు బరిలోకి దిగేందుకు సమాయత్తమయ్యారు.

అంతేకాకుండా పలు పథకాల పేరుతో ప్రజల్ని ఆకట్టుకునే పనిలో పడ్డారు.ఇప్పటికీ అధికార బీఆర్ఎస్( BRS ) పార్టీ ప్రజల కోసం అనేక పథకాలు తీసుకువచ్చింది.

"""/" / ముఖ్యంగా బీసీ బందు( BC Scheme ), దళిత బంధు, మైనారిటీ బందు, కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్, ఆసరా పింఛన్లు, ముదిరాజులకు చేపలు, బైకులు ఇతర వాహనాలు అంతేకాకుండా నాయి బ్రాహ్మణులకు, రజకులకు 25 యూనిట్ల ఉచిత కరెంటు ఇలా కులాల ఆధారంగా వారు చేసే పనిని బట్టి పథకాలు తీసుకువచ్చింది అని చెప్పవచ్చు.

అలాంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరో సరికొత్త పథకంతో ప్రజల్లోకి రాబోతోంది.ఏకంగా వారికి 30 లక్షల రూపాయలతో సహాయం అందించబోతోంది.

"""/" / ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి వారికోసం తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.

ఎరుకల సామాజిక వర్గం అభివృద్ధి కోసం ఇప్పటికే 60 కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది.

అయితే ఈ యొక్క పథకాన్ని ట్రైకార్ ద్వారా అమలు చేయనుంది సర్కారు.పందుల పెంపకం సొసైటీలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకోబోతోంది.

దీనికోసం ఒక్కొక్క యూనిట్ కి 30 లక్షల రూపాయలు అందించనుంది.ఇందులో 50% రాయితీ 40% బ్యాంకు నుంచి అప్పుగా, ఇంకో 10 శాతాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.

ఈ పథకాన్ని కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ వేసి ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో అమలు చేయబోతున్నట్లు సమాచారం.

ఆ విషయంలో అమ్మాయిలకు హ్యాట్సాఫ్… విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!