మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు 47 రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

లింగ సమానత్వం, రాజకీయ సాధికారత కోసం రాజకీయ పార్టీలు కృషి చేయాలని కవిత లేఖలో కోరారు.

రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరారు.

బానిసత్వ పరిస్ధితుల్లో భారతీయ కార్మికులు : ఇటలీ పోలీసుల ఆపరేషన్‌లో 33 మందికి విముక్తి