ప్రజలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తా – బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

తిరుమల: హైదరాబాదుకు వెళ్ళిన తర్వాత తన భవిష్యత్తు కార్యచరణ తెలియజేస్తానని, నేను సీఎంను విమర్శించలేదు, పార్టినీ విమర్శించలేదని బిఆర్ఎస్ పార్టి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలియజేశారు.

మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో మైనంపల్లి హనుమంతరావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ.తన మనవడికి పుట్టి వెంట్రుకలు శ్రీవారి చెంత తీసేందుకు రావడం జరిగిందని, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణంమని, నా కుమారుడు సమాజ సేవ చేస్తున్నాడని, ఒక తండ్రిగా అతనికి సపోర్ట్ గా నిలబడుతాన్నారు.

శ్రీనివాసుడి సన్నిధిలో నిన్న నా వ్యక్తిగతంగా మాట్లాడానని, హైదరాబాద్ వెళ్లాక సమాచారం ఇస్తానని, నా మెదక్, మల్కాజ్‌గిరి ప్రజలతో మాట్లాడి తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానంటూ తెలిపారు.

ప్రజల మద్దతు నాకుందని, నేను సీఎం కేసీఆర్ ను గానీ, పార్టినీ గానీ విమర్శించలేదని, నాకు, నా కుమారుడుకి టికెట్లు ఇస్తే బారీ మెజారిటీతో గెలుస్తాంమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నా కృషితో నేను ఎదిగానని, అలాగే ఉంటానని, నేను చనిపోయే వరకూ ప్రజల కోసం కష్ట పడుతూనే ఉంటానని మైనంపల్లె హనుమంతరావు తెలిపారు.

బ్లాక్ బస్టర్ హిట్స్‌ను కొద్దిలో మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్స్‌.. ఎవరంటే..?