బీఆర్ఎస్ అంటే భ్రమ రాజకీయాల పార్టీ..జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీలోని టీడీపీ, వైసీపీ నేతలకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు.టీడీపీ ఆరోపిస్తున్నట్లు వైసీపీకి, బీజేపీకి ఎటువంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు.
బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతూ వైసీపీతో కలిసేందుకు ప్రయత్నిస్తుందని అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు.
ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని వెల్లడించారు.అదేవిధంగా బీఆర్ఎస్ అంటే భ్రమ రాజకీయాల పార్టీ అని విమర్శించారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో అనవసరపు జోక్యం చేసుకుని డ్రామాలు ఆడిందని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో కొత్త వైరస్… అదిగాని పాజిటివ్ అయితే 3 రోజుల్లోనే మటాష్?