బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో విపక్షాల దిమ్మ తిరుగుతుంది..: మంత్రి హరీశ్ రావు

నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో నిర్వహించిన సభలో మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈసారి బీఆర్ఎస్ పెట్టే మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుందని తెలిపారు.ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఈ క్రమంలోనే మూడో సారి కూడా కేసీఆరే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న అవగాహన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదన్నారు.మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు.అయితే అబద్ధాల కాంగ్రెస్ ను నమ్మితే ఆగమవుతారని పేర్కొన్నారు.

నిత్యం ప్రజా సేవలో ఉండే బాజిరెడ్డిని మరోసారి గెలిపించాలని సూచించారు.

రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవి అందుకోబోతున్నారా?