బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల..!!
TeluguStop.com
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే దిశగా కసరత్తు చేస్తుంది.
ఈ క్రమంలో ఇవాళ తెలంగాణభవన్ వేదికగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించారు.
మ్యానిఫెస్టోలో అంశాలు:
- రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ
- రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకం
- జూన్ నుంచి అమల్లోకి కేసీఆర్ బీమా
- తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో సన్నబియ్యం
- సౌభాగ్యలక్ష్మీ పేరుతో అర్హులైన పేద మహిళలకు రూ.
3 వేల గౌరవ భృతి
- అర్హులైన లబ్ధిదారులకు, జర్నలిస్టులకు రూ.400 కే గ్యాస్ సిలిండర్
- రైతుబంధు రూ.
16 వేల వరకూ పెంపు
- కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో హెల్త్ స్కీమ్
- ఆరోగ్య శ్రీ పరిధిల రూ.
15 లక్షలకు పెంపు
- హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
- అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్
- మహిళా సంఘాలకు భవనాలు నిర్మాణం
- అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ
- ఓపీఎస్ డిమాండ్ పై కమిటీ నియామకం
- దశల వారీగా ఆసరా పెన్షన్ల పెంపు
- దివ్యాంగుల పెన్షన్ రూ.
6 వేలకు పెంపు
- ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు
- అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత, అన్ని హక్కులు.
ఈ సినీ సెలబ్రిటీస్ అందరూ రాజుల కుటుంబానికి చెందినవారు !