బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే దిశగా కసరత్తు చేస్తుంది.

ఈ క్రమంలో ఇవాళ తెలంగాణభవన్ వేదికగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించారు.

మ్యానిఫెస్టోలో అంశాలు: - రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ - రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకం - జూన్ నుంచి అమల్లోకి కేసీఆర్ బీమా - తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో సన్నబియ్యం - సౌభాగ్యలక్ష్మీ పేరుతో అర్హులైన పేద మహిళలకు రూ.

3 వేల గౌరవ భృతి - అర్హులైన లబ్ధిదారులకు, జర్నలిస్టులకు రూ.400 కే గ్యాస్ సిలిండర్ - రైతుబంధు రూ.

16 వేల వరకూ పెంపు - కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో హెల్త్ స్కీమ్ - ఆరోగ్య శ్రీ పరిధిల రూ.

15 లక్షలకు పెంపు - హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు - అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ - మహిళా సంఘాలకు భవనాలు నిర్మాణం - అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ - ఓపీఎస్ డిమాండ్ పై కమిటీ నియామకం - దశల వారీగా ఆసరా పెన్షన్ల పెంపు - దివ్యాంగుల పెన్షన్ రూ.

6 వేలకు పెంపు - ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు - అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత, అన్ని హక్కులు.

వైరల్ వీడియో: ఆ పెద్దాయనకు సలాం అంటున్న ఆనంద్ మహేంద్ర