ఈనెల 16న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల..: ఎంపీ నామా

బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్తున్న మాటలను నమ్మవద్దని ఎంపీ నామా సూచించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

ఈ నెల 16వ తేదీన కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని వెల్లడించారు.

అయితే ఈ మ్యానిఫెస్టోను చూస్తే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ ను మూడో సారి కూడా ముఖ్యమంత్రిని చేయాలని తెలిపారు.

రూ.10 విషయంలో ఆటోడ్రైవర్‌ను చితకబాదిన ట్రాన్స్‌జెండర్ ఉమెన్.. వీడియో వైరల్..