ఈనెల 15న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేస్తుంది.

ఈ మేరకు ఈనెల 15న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల కానుంది.15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో అభ్యర్థులతో కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది.

అదే రోజు 119 స్థానాల్లోని అభ్యర్థులకు బీఫామ్ లను ఆయన అందించనున్నారు.అలాగే ఎన్నికల ఖర్చు చెక్కులతో పాటు ప్రచార సామాగ్రిని అభ్యర్థులకు పంపిణీ చేయనున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఈనెల15వ తేదీ నుంచి కేసీఆర్ ప్రచారానికి రంగం సిద్ధం చేస్తున్నారు.ఇందులో భాగంగా కేసీఆర్ వరుస పర్యటనలు ఉండనున్నాయి.

ఈ మేరకు ఈనెల 15న హుస్నాబాద్ లో సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

18న జడ్చర్లతో పాటు మేడ్చల్ లో నిర్వహించే బహిరంగ సభలకు హాజరుకానున్నారు.అదేవిధంగా నవంబర్ 9వ తేదీన కోనాయపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్న కేసీఆర్ అనంతరం గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఆ ఒక్క కారణంతోనే కల్కి సినిమాలో నటించా.. మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్!