ప్రధాని మోదీపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఫైర్

ప్రధాని మోదీపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జాతీయ రహదారులకు, మోదీకి సంబంధం లేదని చెప్పారు.

జాతీయ రహదారులను అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటించారని తెలిపారు.అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు.

వందే భారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారన్నారు.కుటుంబ పాలనపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదని తెలిపారు.

అమిత్ షా కొడుకు ఎక్కడున్నారన్న వినోద్ కుమార్ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తండ్రి ఎవరని ప్రశ్నించారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే కాదా అని నిలదీశారు.

తెలంగాణకు వచ్చి మోదీ కొత్తగా ఏం ఇచ్చారో చెప్పాలన్నారు.కేంద్రం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని విమర్శించారు.

ల్యాండ్ స్లయిడ్ నుంచి మనిషిని రక్షించిన కుక్క.. ప్రాణాలకు తెగించిందిగా..?