రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్..!

తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్( KTR ) రేపు ఢిల్లీకి( Delhi ) వెళ్లనున్నారు.

ఈ క్రమంలో ఆయన సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను( Kavitha ) కలవనున్నారు.

కస్టడీ సమయంలో రోజు గంటపాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు.

అయితే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులు కలిసేందుకు కవితకు న్యాయస్థానం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

మామయ్య పవన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సాయితేజ్.. అభిమానానికి ఫిదా అంటూ?