బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్
TeluguStop.com
బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్( BRS Leader Krishank ) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు పంతంగి చెక్ పోస్ట్ వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓయూ వీసీ పేరుతో ఫేక్ లెటర్ తయారు చేసినట్లు క్రిశాంక్ పై ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఆయనపై కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
కరెంట్ మరియు నీటి కొరత కారణంగా హాస్టల్స్ ను మూసివేస్తున్నట్లు వీసీ పేరుతో సర్క్యులర్ జారీ అయింది.
అయితే ఈ సర్క్యులర్ ను పోలీసులు ఫేక్ అని నిర్ధారించారు.ఈ క్రమంలో ఫేక్ సర్క్యులర్ వెనుక క్రిశాంక్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే సర్క్యులర్ రూపొందించినట్లు క్రిశాంక్ పై ఆరోపణలు వస్తున్నాయని సమాచారం.
వరుసకు కూతురైన మైనర్‌పై బాబాయ్ దారుణం..!