మౌనం వీడిన కవిత : అదానికో న్యాయం.. ఆడ బిడ్డకో న్యాయమా ?

చాలా రోజులుగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సైలెంట్ అయిపోయిన బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kalvakuntla Kavitha ) ఎట్టకేలకు మౌనం వీడారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) వ్యవహారంలో అరెస్టయి,  బెయిల్ పై బయటకు వచ్చిన కవిత అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.

ఆమె పొలిటికల్ సైన్స్ పై అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో,  తాజాగా ఆమె కేంద్ర బిజెపి పెద్దలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.

ముఖ్యంగా సంచలనం సృష్టిస్తున్న గౌతమ్ ఆదాని( Gautam Adani ) లంచం , మోసం ఆరోపణల వ్యవహారంపై ఆమె స్పందించారు.

ఈ ఆరోపణలతోనే ఆయనపై అమెరికాలో కేసు నమోదు కావడం,  ఎఫ్ బీ ఐ ఆయన వ్యవహారాలపై దర్యాప్తు మొదలుపెట్టిన నేపథ్యంలో,  """/" / ఆ అంశాలపై కవిత స్పందించారు.

ఇప్పటికే గౌతమ్ ఆదాని కేసులో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది.

గౌతమ్ ఆదానిని అరెస్టు కాకుండా ప్రధాని మోడీ అడ్డుకుంటున్నారని,  ఆదానికి మోడీ( Modi ) రక్షణగా నిలిచారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే కవిత కూడా గౌతం ఆదాని వ్యవహారంపై అంతే స్థాయిలో మండిపడ్డారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కవిత విమర్శలు చేశారు.అఖండ భారతంలో ఆదానికో న్యాయం,  ఆడబిడ్డకో న్యాయమా అంటూ కవిత ప్రశ్నించారు.

"""/" / ఆధారాలు లేకపోయినా ఆడబిడ్డ కాబట్టి అరెస్టు చేయడం ఈజీ అయ్యిందని,  ఆధారాలు ఉన్నా,  ఆదానిని మాత్రం అరెస్ట్ చేయడం కష్టమా అంటూ కవిత ప్రశ్నించారు .

ఆదానీపై ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆయన వైపేనా అంటూ కవిత ప్రశ్నించారు.

మోది ప్రభుత్వం అఖండ భారతాన్ని ప్రచారం చేస్తుంది.కానీ న్యాయం విషయంలో సెలెక్టివ్ జస్టిస్ ను అందిస్తున్నారని కవిత విమర్శించారు.

రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యం లేకుండా అరెస్టు చేసి,  నెలల తరబడి విచారణ చేయిస్తారని , కానీ గౌతమ్ అదాని పై పదేపదే తీవ్ర ఆరోపణలు వచ్చినా ఆయనను స్వేచ్ఛగా తిరగనిస్తారని కవిత విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని అదానీ పై చర్యలు తీసుకోకుండా ఆపేది ఎవరు అంటూ కవిత ప్రశ్నించారు.

ఆ హీరో నాతో ఇబ్బందికరంగా మాట్లాడాడు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు వైరల్!