Inturi Shekar Arrest : ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా..!
TeluguStop.com
ఖమ్మం జిల్లాలో( Khammam District ) అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది.బీఆర్ఎస్ నేత, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ను( DCCB Director Inturi Shekar ) టాస్క్ ఫోర్స్ పోలీసులు( Taskforce Police ) అర్ధరాత్రి అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
ఇంటూరి శేఖర్ అరెస్ట్ వ్యవహారాన్ని జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఖండించారు.ఈ క్రమంలోనే నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ నేపథ్యంలో అధికారులతో ఎమ్మెల్సీ తాతా మధు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
"""/" /
రాజకీయ కక్ష్యలో భాగంగానే ఇంటూరి శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ నేతలు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు( BRS MLC Tata Madhu ) ఆరోపించారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అప్పనంగా మంత్రి పదవులు పొందిన వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియడం లేదని మండిపడ్డారు.
చిరంజీవి అంటే అంత ఇష్టమంటున్న బన్నీ.. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుందా?