రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం

హైదరాబాద్ :మే 16 రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది.పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బుధవారం సమావేశం కానున్నారు.

పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.రేపు తెలంగాణ భవన్( Telangana Bhavan ) లో జరగనున్న ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

బీఆర్ఎస్ పార్టీగా దేశంలో అనుసరిచాల్సిన విధానాలు, ఈ ఏడాది జరగనున్న ఎన్నికలకు ఏ విధంగా జనం ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలతో కేసీఆర్( KCR ) చర్చించనున్నారు.

బీజేపీ కక్ష సాధింపులపై.ప్రధానంగా బీజేపీ కక్ష సాధింపులపై ఏ విధంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్న దానిపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తదనంతర పరిణామాలపై నేరుగా చర్చించకున్నా ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం సంస్థల నుంచి ఇబ్బందులు ఎదురయితే పార్టీ వారికి అండగా నిలబడుతుందన్న సంకేతాలను ఈ సమావేశం ద్వారా కేసీఆర్ ఇవ్వనున్నారు.

దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు..: సీఈవో రాజీవ్ కుమార్