అలక వీడని బీఆర్ఎస్ అసంతృప్తులు ! కేటీఆర్ రాక కోసం వెయిటింగ్ 

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS Party ) లో అసంతృప్తి స్వరాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

టికెట్ల ప్రకటన తరువాత తమకు అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

పార్టీలో సీనియర్ నాయకులైన తమను పక్కన పెట్టడం ఏమిటని,  ఎప్పటి నుంచో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని , గతంలో తమకే టికెట్ కేటాయిస్తామని కేసీఆర్, కేటీఆర్ సైతం హామీ ఇచ్చారని,  కానీ టికెట్ల ప్రకటన జాబితాలో తమ పేర్లు లేకపోవడం ఏమిటో అర్థం కాక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

"""/" / కొంతమందికి వివిధ నామినేటెడ్ పోస్టులను ఆఫర్ చేస్తున్నారు .వీరిలో కొంతమంది అలక వీడగా,  మరి కొంత మంది మాత్రం తమకు టికెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు.

  ఇప్పటికి నియోజకవర్గ ప్రజలు , ముఖ్య అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.

అభ్యర్థుల జాబితాలో మార్పు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతుండడంతో,  మరికొంత కాలం పాటు వేచి చూడాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్( KTR ) అమెరికా పర్యటనలో ఉన్నారు.

ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో భేటీ అయి తమ టికెట్ సంగతి గురించి ఆయన వద్ద తేల్చుకోవాలని చూస్తున్నారు.

గతంలో కేటీఆర్ హామీ పొందిన నేతలు ఆయన రాక కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

"""/" / మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,  తాటికొండ రాజయ్య , చిలుముల మదన్ రెడ్డి,  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు( Tummala Nageswara Rao ) ఇలా చాలామంది కేటీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.

వీరిలో కొంతమందికి ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నా,  మరికొద్ది రోజులపాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నారు.

కేటీఆర్ జోక్యం తోనైనా తమకు టికెట్ దక్కుతుందనే ఆశా భావంతో ఉన్నారట.

బాబు ప్లాన్ వర్కౌట్ అయితే ఏపీలో 25,000 ఉద్యోగాలు.. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారా?