మహారాష్ట్రలో పోటీకి బీఆర్ఎస్ సై..!
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ దేశ వ్యాప్తంగా తన సత్తా చాటుకునేందుకు ఒక్కొక్క అడుగు వేస్తోంది.
ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లోనూ క్యాడర్ ను సిద్ధం చేసుకుంటుంది.ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ సభ విజయవంతం కావాడంతో అక్కడ పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఆసక్తి కనబరుస్తోంది.
మరో మూడు నెలల్లో మహారాష్ట్రలో జెడ్పీ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే.దీంతో త్వరలో అక్కడకు బీఆర్ఎస్ ప్రచార రథాలు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పార్టీ అధినేత.
కాగా బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ప్రజలు, ప్రజా ప్రతినిధులతో ఆకర్షితులవుతున్నారని సమాచారం.ఈ నేపథ్యంలోనే నాందెడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా పరిధిలోని 50 గ్రామాల సర్పంచులు కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌కు మద్ధతు ప్రకటించారు.
శివసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సర్పంచులు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారని సమాచారం.
తెలంగాణలో అమలవుతున్న వివిధ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది.
Slot 10: Kundensupport Und Servicequalität Für Spieler In DE