Warangal BRS : ఉమ్మడి వరంగల్ లో గడ్డు పరిస్థితుల్లో బీఆర్ఎస్..!!

ఉమ్మడి వరంగల్( Warangal ) జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తున్నాయి.

ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీలో చిచ్చు రాజుకుంది.ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సీటును ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party )అధిష్టానం మొగ్గు చూపుతుందన్న వార్తలపై నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులతో పాటు విద్యార్థి నేతలు భగ్గుమంటున్నారు.

ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. """/" / తాజాగా వరంగల్ నేతలు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )తో సమావేశం కావడంతో జిల్లా బీఆర్ఎస్ లో నైరాశ్య వాతావరణం కన్పిస్తుంది.

అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, వరంగల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి( Aruri Ramesh) సైతం పార్టీ హైకమాండ్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారంటూ ప్రచారం సాగుతోంది.

దీంతో ఆరూరితో కేసీఆర్, కేటీఆర్ మరియు హరీశ్ రావు మంతనాలు జరిపిన ఫలించలేదని తెలుస్తోంది.

తాజాగా కావ్య అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ వెనక్కి తగ్గుతుందా? లేదా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్…వర్కౌట్ అవుతుందా..?