నిరుద్యోగుల కష్టాలు తీర్చింది బీఆర్ఎస్సే..: కేటీఆర్

తెలంగాణలో నిరుద్యోగుల కష్టాలను తీర్చింది బీఆర్ఎస్సేనని( BRS ) ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు.సుమారు 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.అయితే తాము అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.

32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.కేసీఆర్( KCR ) ఇచ్చిన ఉద్యోగాలు తప్ప ఈ ఐదు నెలల్లో ఎవరికీ ఉద్యోగాలు రాలేదని పేర్కొన్నారు.

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామన్న కేటీఆర్ 95 శాతం లోకల్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దని తెలిపారు.

వీడియో: ఆకాశంలో ఆశ్చర్యపరిచే దృశ్యం.. మేఘాల్లో నడుస్తున్న మనిషి..??