బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల లో రైతులకు చేసింది ఏమీ లేదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt ) 10 సంవత్సరాల కాలంలో రైతులకు చేసింది ఏమీ లేదని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మేము అధికారంలో ఉన్న పది సంవత్సరాల లో తప్పు చేసినాం ప్రజలారా రైతులారా మమ్ముల్ని మన్నించండి అని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లిన నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ ఎస్ పార్టీ వాళ్లు దిష్టిబొమ్మ దగ్ధం చేసినంత మాత్రాన ఏమీ అయ్యేది లేదు మీరు ఏమీ సాధించేది ఏమీలేదన్నారు.

రేవంత్ రెడ్డి విడుతలవారీగా 500 రూపాయల బోనస్ ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా బోనస్ ఇస్తాడని మీరు ఏమీచేసిన అవి ఇవ్వక తప్పదన్నారు, మేము కూడా అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

మేము అడిగి తెచ్చుకున్నాము అని మీరు అంటారు కూడా మీ కంటే ముందే మేమే ప్రకటించామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు పుట్టగతులు లేకుండా చేస్తున్నాడని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడనే ఉద్దేశంతోనే బిఆర్ ఎస్ వాళ్లు ఆందోళనకు దిగుతున్నారని దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దోమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వారు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గేటు ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఆకారణంగా దగ్ధం చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు నెలల కాలంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు.

సన్నపు వడ్లను ఎవరైతే రైతు సాగు చేస్తారో వాళ్లను ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ముందుగా రైతులకుకిచ్చిన హామీని నెవేర్చడాని కీ సన్నవడ్లకు 500 బోనస్ అని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు.

అదేవిధంగా గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ,రేషన్ షాపులలో సన్న బియ్యం ప్రవేశపెట్టాలని ఉద్దేశంతోనే విడతల వారిగా బోనస్ 500 రూపాయలు ముఖ్యమంత్రి ఇస్తామని అనడం జరిగిందన్నారు, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka )స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ బిఆర్ ఎస్ పార్టీ నాయకుల తొందరపాటు చర్యల వల్ల అధికారం కోల్పోయి మతిభ్రమించి పిచ్చి శ్రేష్టలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించిన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి సన్నబియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు.

అందుకే సన్న లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం జరిగిందని దాన్ని పట్టుకొని సన్నబియ్యం ఇయ్యరట దొడ్డు బియ్యం ఇయ్యరట అంటూ బిఆర్ ఎస్ వాళ్లు రోడ్లమీద కెక్కి రేవేంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్దం చేస్తే మీ పరువే పోతుంది తప్పా మాకు జరిగేది.

ఒరిగేది ఏమీ లేదన్నారు.మీ బిఆర్ ఎస్ ప్రభుత్వం హాయాంలో హాస్టళ్లకు , పాఠశాలలకు, రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మీరు ఇచ్చిండ్రా మీ ముఖాలకు అని ఆయన ప్రశ్నించారు.

మా ముఖ్యమంత్రి ఒక్కసారి మాట ఇచ్చిందంటే వెనుక్కి తిరిగే ప్రశ్నే లేదన్నారు.బిఆర్ ఎస్ పార్టీ వాళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , వంగ గిరిధర్ రెడ్డి, కొత్తపెళ్లి దేవయ్య, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు నాయకులు గంట బుచ్చాగౌడ్ , బానోతు రాజు నాయక్ , సూడిది రాజేందర్,ఏ రవి, బండారి బాల్ రెడ్డి,నంది కిషన్, ఎడ్ల రాజ్ కుమార్,దుమాల మాజీ ఎంపీటీసీ బాలకిషన్ గౌడ్,చెటుకూరి బాలయ్య గౌడ్ ,దేవరాజు గోలి పెళ్లి ప్రతాపరెడ్డి , , ఇమామ్ బాయి, గంట వెంకటేష్ గౌడ్ , చంద్రమౌళి భాస్కర్ జాదవ్, లక్ష్మణ్ , పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, గుర్రపు రాములు , ఎండి ఇలియాస్, గంట ఆంజనేయులు గౌడు, వంగ బాల్రెడ్డి, ముని సింగ్ నాయక్, ప్రశాంత్ నాయక్, జయ రామ్ నాయక్, మాలోత్ రవి నాయక్ , జవహర్ నాయక్ , నూనవత్ గణేష్ నాయక్, భూక్యా దేశాయ్ నాయక్ ,బద్దిపడిగే మాధవరెడ్డి , శంకర్ , పొన్నాల తిరుపతిరెడ్డి , వివిధ గ్రామశాఖల అద్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. పుష్ప 2 ను బాయ్ కాట్ చేయాలంటున్న ఫ్యాన్స్?