కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ దూరం
TeluguStop.com
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎల్లుండి పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ప్రారంభోత్సవ వేడుకలకు దూరంగా ఉండాలని 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
తాజాగా ఈ లిస్టులో బీఆర్ఎస్ చేరిందని సమాచారం.ఈ విషయాన్ని బీఆర్ఎస్ రేపు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.