మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ… కేసీఆర్ స్పష్టం

మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ మేరకు జిల్లా పరిషత్ ఎన్నికల్లో  బరిలోకి దిగనున్నారని సమాచారం.పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలంటూ కేసిఆర్ పిలుపునిచ్చారు.

గత తొమ్మిదేళ్ల కిందట తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు.కానీ ఇవాళ నీరు, కరెంట్ సమృద్ధిగా ఉన్నాయన్నారు.

అటువంటి తెలంగాణ బాగుపడినప్పుడు  మహారాష్ట్ర ఎందుకు అభివృద్ధి చెందదని పేర్కొన్నారు.తెలంగాణలో కంటే మహారాష్ట్రలో సంపద ఎక్కువ అని వెల్లడించారు.

చాలా తక్కువ సమయంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసి చూపించవచ్చని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో త్వరలోనే విప్లవం వస్తుందని తెలిపారు.

దయచేసి నిజాయితీతో ఉండండి… సంచలనంగా మారిన సమంత పోస్ట్?