రేవంతే టార్గెట్ గా బీఆర్ఎస్ భారీ వ్యూహం ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తనకు ఎదురే లేదన్నట్లుగా దూసుకుపోతున్నారు.

  ఒకవైపు కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూనే అధిష్టానం పెద్దల వద్ద మంచి పలుకుబడి సంపాదించిన రేవంత్ , తెలంగాణలోనూ తనకు రాజకీయంగా ఎదురే లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

  దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా రేవంత్ అనేక వ్యూహాలు రచిస్తుండగా,  రేవంత్ దూకుడు కు  బ్రేకులు వేసే విధంగా బీఆర్ఎస్( BRS ) కూడా వ్యూహాలు రచిస్తోంది .

దీనిలో భాగంగానే రేవంత్,  కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియా కొద్దిరోజులుగా అనేక విమర్శలతో విరుచుకుపడుతోంది.

రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు,  ఆయన పర్యటనలు , బంధు వర్గం కు సంబంధించిన అన్ని వ్యవహారాలపైన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, జనాలో చర్చ జరిగే విధంగా చేస్తుంది.

"""/" / మొన్నటి వరకు బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా బలహీనంగా ఉండగా,  ఇప్పుడు ఆ సోషల్ మీడియా ను బలోపేతం చేసే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )దృష్టి సారించారు .

ఈ మేరకు కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ సోషల్ మీడియా టీంతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్ అనే కీలక సూచనలు చేశారు.

  దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా టీం అనేక విమర్శలు చేసింది.

రేవంత్ రెడ్డి కుటుంబం పైన నెగటివ్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది.  ముఖ్యంగా రేవంత్ రెడ్డి ని ఇరుకున పెట్టే విధంగా ఆయన సోదరుడు ఇటీవల విదేశీ టూర్ కు వెళ్ళగా,  దానిపైన బిఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ కు దిగింది.

"""/" /  రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి( Tirupati Reddy ) పుట్టినరోజు వేడుకలపైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా టార్గెట్ పెట్టింది.

  అలాగే రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లి అక్కడ స్వచ్ఛ బయో  కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోవడం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని,  ముఖ్యంగా తన సోదరుడు జగదీష్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చే విధంగా రేవంత్ వ్యవహరించారని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విమర్శలు మొదలుపెట్టింది.

  రేవంత్ కుటుంబ సభ్యుల పైన నెగటివ్ ప్రచారానికి దిగింది.ఏదో విధంగా రేవంత్ ను ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాను బలోపేతం చేసే విధంగా కేటీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించినట్లు సమాచారం.

సోలో హీరోగా వరుసగా మూడు భారీ ఫ్లాపులు.. మట్కాతో వరుణ్ లక్ష్యాన్ని సాధిస్తారా?