BRS Congress : తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు..!!

తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఎల్ఆర్ఎస్ అంశంపై గులాబీ శ్రేణులు నిరసనలకు దిగారు.గతంలో కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్( LRS ) ను ఉచితంగా అమలు చేయాలన్న విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫీజులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తుంది. """/" / ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

ఫీజు వసూలు చేయడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని అమీర్ పేటలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ( Talasani Srinivas Yadav )ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.కాగా ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసేంత వరకు వదిలిపెట్టమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

నలుగురు భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్ .. ఏం చేశారంటే?