ఆస్తమా వేధిస్తుందా? అయితే బ్రౌన్ షుగ‌ర్‌తో నివారించుకోండిలా!

ప్ర‌స్తుతం రెయినీ సీజ‌న్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే ఈ సీజ‌న్‌లో ఆస్త‌మా బాధితులు తీవ్రంగా ఇబ్బంది ప‌డిపోతుంటారు.

వాతావ‌ర‌ణం చల్ల‌గా మారిపోవ‌డం వ‌ల్ల శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, గురక, దగ్గు, ఛాతీలో నొప్పి, పిల్లి కూతలు, ఆయాసం వంటి ల‌క్ష‌ణాలు ఆస్త‌మా రోగుల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తాయి.

అయితే వీటిని నివారించ‌డంలో కొన్ని కొన్ని ఆహార ప‌దార్థాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి వాటిలో బ్రౌన్ షుగ‌ర్ ఒక‌టి.

"""/" / ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది వైట్ షుగ‌ర్‌కు బ‌దులుగా బ్రౌన్ షుగ‌ర్‌నే వాడుతున్నారు.

బ్రౌన్ షుగ‌ర్ లో ఎటువంటి రసాయనాలు ఉండ‌వు.పైగా ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, జింక్‌, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఐర‌న్‌, సెలీనియం, విట‌మిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు బ్రౌన్ షుగ‌ర్‌లో నిండి ఉన్నాయి.

అలాగే బ్రౌన్ షుగ‌ర్ యాంటీ సెప్టిక్ గా కూడా ప‌ని చేస్తుంది.అందుకే బ్రౌన్ షుగ‌ర్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా ఆస్త‌మా ల‌క్ష‌ణాల‌కు చెక్ పెట్ట‌డంలో బ్రౌన్ షుగ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రి దీనిని ఎలా యూజ్ చేయాలి? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్త‌మాతో బాధ ప‌డే వారు.ఒక క‌ప్పు వాట‌ర్ తీసుకుని అందులో ఒక‌టిన్న‌ర్ స్పూన్ బ్రౌన్ షుగ‌ర్ మ‌రియు దంచిన అల్లం ముక్క వేసి బాగా మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని సేవించాలి.ఇలా ఉద‌యం, సాయంత్రం తీసుకుంటే.

ఆస్త‌మా ల‌క్ష‌ణాలు కంట్రోల్ ఉంటాయి.మీరు ఫ్రీగా ఉంటారు.

"""/" / ఇక బ్రౌన్ షుగ‌ర్‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.వైట్ షుగ‌ర్‌కు బ‌దులుగా బ్రౌన్ షుగ‌ర్ ను తీసుకుంటే.

అధిక బ‌రువు అదుపులో ఉంటుంది.నెల‌స‌రి స‌మ‌యంలో ఇబ్బంది ప‌ట్టే నొప్పులు దూరం అవుతాయి.

నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు పడుతుంది.

BJP Purandeswari : పార్టీలో ప్రత్యర్థులకు చిన్నమ్మ చెక్ పెట్టేశారా ?