తెగిన పెన్నా నది బ్రిడ్జి.. భయం గుప్పిట్లో ప్రజలు

శ్రీ సత్యసాయి జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా పోచంపల్లి వద్ద పెన్నా నది బ్రిడ్జి తెగింది.దీంతో పోచంపల్లి, హిందూపురం చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

అటు ఎగువ ప్రాంతం కర్ణాటక నుంచి పెన్నానదికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అప్రమత్తమైన అధికార యంత్రాంగం స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మధుమేహం ఉన్నవారు బెండకాయ తింటే ఏం అవుతుందో తెలుసా..?