బ్రొకోలితో మ‌ధుమేహానికి చెక్‌.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

మ‌ధుమేహం లేదా డ‌యాబెటిస్‌.నేటి కాలంలో చాలా మంది ముప్పై ఏళ్ల‌కే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు.

శరీరంలో ఉండే చక్కెర హెచ్చు తగ్గుల వల్ల మ‌ధుమేహం బారిన ప‌డుతుంటారు.అందుకు కార‌ణాలు చాలానే ఉన్నాయి.

మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, హార్మోన్ల లోపం ఇలా చాలా అనేక కార‌ణాల వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌స్తుంటుంది.

ఇక డ‌యాబెటిస్ వ‌చ్చిందంటే జీవిత‌కాలం ఉంటుంది అని చాలా మంది భావిస్తుంటారు.అలాగే జీవిత కాలం మందులు వాడాల‌ని అనుకుంటారు.

కానీ, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మ‌ధుమేహానికి చెక్ పెట్ట‌వ‌చ్చు.అందుకు బ్రొకోలి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

చూసేందుకు కాలీ ఫ్లవర్‌లా కన్పించినా ఆకుపచ్చగా ఉండే బ్రొకోలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

విటమిన్లు, మినరల్స్ పుష్క‌లంగా ఉండే బ్రొకోలిని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయి‌లు ఎప్పుడూ అదుపులో ఉంటాయి.

కాబ‌ట్టి, మ‌ధుమేహంతో బాధ ప‌డుతున్నవారు ఖ‌చ్చితంగా బ్రొకోలిని తీసుకోవ‌డం మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బ్రొకోలితో మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.పీచుపదార్థం ఉండే బ్రొకోలిని వారానికి రెండు సార్లు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్ క‌రిగించి.

అధిక బ‌రువుకు చెక్ పెడుతుంది.ఇక ప్ర‌స్తుత చ‌లి కాలంలో మ‌రియు క‌రోనా స‌మ‌యంలో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే బ్రొకోలిని తిన‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.ఎందుకంటే, ఇందులో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉంటుంది.

"""/" / ఇక బ్రొకోలిని ఎప్పుడూ ప‌చ్చిగానే తీసుకోవ‌డం మంచిది.ఎందుకంటే, ప‌చ్చిగా తీసుకున్న‌ప్పుడే.

అందులోని తొంబై శాతం పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందుతాయి.అదేవిధంగా, బ్రొకోలిని ప‌చ్చిగానే తిన‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మ‌రియు క్యాల్షియం అధికంగా ఉండే బ్రొకోలిని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, కండ‌రాలు మ‌రియు దంతాలు బ‌లంగా మార‌తాయి.

అమ్మ బాబోయ్.. పుష్ప-2 పాటకు బామ్మ ఊర మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్..