మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు..నెగటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్న ‘బ్రో ది అవతార్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరో గా నటించిన 'బ్రో ది అవతార్'( Bro The Avatar ) చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై కాస్త డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇలాంటి సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ రావాలి, లేకపోతే ఓపెనింగ్స్ రావడం అనేది చాలా కష్టం అయిపోతుంది.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ చిత్రానికి కోపోదా అద్భుతమైన ఓపెనింగ్స్ ని రాబట్టాడు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాడని, ఇది ఆయన రేంజ్ వసూళ్లు కాకపోయినా సినిమా జానర్ కి, వచ్చిన టాక్ కి చాలా ఎక్కువ వసూళ్లే వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

ముఖ్యంగా నైజాం( Nizam ) ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు అద్భుతమైన వసూళ్లు వచ్చాయని, మారుమూల థియేటర్స్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయని అంటున్నారు.

ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అదే రేంజ్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

"""/" / రెండవ రోజు కూడా చాలా ప్రాంతాలలో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయట.

ఉదాహారానికి నిజామాబాద్( Nizamabad ) లో రెండవ రోజు వచ్చిన వసూళ్లు మొదటి రోజుకంటే ఎక్కువ అట.

మొదటి రోజు ఇక్కడ ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు, దానికి కారణం అక్కడ వరదలు మరియు వర్షాలు ఉండడమే.

కానీ రెండవ రోజు వర్షాలు ఆగడం తో సినిమాని మొదటి రోజు చూడని వాళ్లంతా రెండవ రోజు చూసారు.

ఫలితంగా రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

ఉత్తరాంధ్ర , సీడెడ్ వంటి ప్రాంతాలలో కూడా ఇదే రిపీట్ అయ్యింది., డివైడ్ టాక్ ని రప్పించుకున్న ఒక క్లాస్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.

రెండవ రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

"""/" / మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకి కలిపి 55 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు.

ఇదే రేంజ్ ఊపు ని కొనసాగిస్తూ పోతే కచ్చితంగా చిత్రం ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంటున్నారు.

ఈ చిత్రం నిజంగా ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది సోమవారం వచ్చే వసూళ్ల బట్టి తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 98 కోట్ల రూపాయలకు జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.

బ్రేక్ ఈవెన్ కి మరో 43 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి .