బ్రో పవన్ అలా చేస్తున్నాడా..?
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Klayan ) సాయి తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో.
తమిళంలో సూపర్ హిట్టైన వినోదయ సీతం రీమేక్ గా ఈ సినిమా వస్తుంది.
ఈ సినిమా కు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.సినిమా లో పవన్ దేవుడిగా నటిస్తుండగా సాయి తేజ్ సినిమాలో ఎక్కువ భాగం ఉంటాడని తెలుస్తుంది.
అయితే పవన్ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా ఇంప్యాక్ట్ భారీగా ఉంటుందని తెలుస్తుంది.
బ్రో సినిమా( Bro Movie)లో ఫస్ట్ సాయి తేజ్ పాత్ర ఇంట్రడ్యూస్ అవుతుందట.
ఆ తర్వాత పవన్ పాత్ర వస్తుంది.అంతేకాదు సినిమాలో స్క్రీన్ స్పేస్ కూడా సాయి తేజ్ కే ఎక్కువ ఉంటుందట.
అయితే పవన్ ఉన్నంతసేపు మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.
అయితే బ్రో సినిమా కోసం పవన్ కూడా సాయి తేజ్( Sai Dharam Tej ) క్యారెక్టర్ ని ఎక్కువ స్కోప్ ఇచ్చేలా స్క్రీన్ ప్లే రాయమన్నారట.
పవన్ ముందు మేనల్లుడు మరీ తగినట్టు ఉంటే తను సోలో హీరోగా చేసే సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందని అలా చెప్పారట.
మొత్తానికి పవన్ కళ్యాణ్ సాయి తేజ్ బ్రో అలా మెగా పవర్ ఫ్యాన్స్ ని అలరించడానికి జూలై 28న వస్తుంది.
వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన