బ్రో డాడీ తెలుగు రీమేక్ ప్లాన్స్..!

లూసిఫర్ హిట్ అవడంతో పృధ్వి రాజ్ సుకుమారన్ డైరక్షన్ లో మోహన్ లాల్ నటించిన సినిమా బ్రో డాడీ.

ఈ సినిమాలో పృధ్వి రాజ్ కూడా నటించారు.పృధ్వి రాజ్, మోహన్ లాల్ సూపర్ హిట్ కాంబోగా వచ్చిన ఈ సినిమా జనవరి 26న డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజైంది.

ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా రీమేక్ పై తెలుగు మేకర్స్ దృష్టి పెట్టారని తెలుస్తుంది.

ఆల్రెడీ సురేష్ బాబు బ్రో డాడీ రీమేక్ రైట్స్ కోసం చర్చలు చేస్తున్నారని తెలుస్తుంది.

మోహన్ లాల్, పృధ్వి రాజ్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ లో దగ్గుబాటి స్టార్స్ నటిస్తారని టాక్.

విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి బ్రో డాడీ తెలుగు రీమేక్ చేస్తారని టాక్.

సురేష్ బాబు మళయాళ వర్షన్ చూసి ఈ సినిమా తెలుగు రీమేక్ తో దగ్గుబాటి మల్టీస్టారర్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

ఇప్పటికే సురేష్ బాబు వెంకటేష్, రానా లతో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు బ్రో డాడీ తెలుగు రీమేక్ కూడా వారితో చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

భారత సంతతి బాలుడి ప్రతిభ.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంటెస్టెంట్‌లో గోల్డ్ మెడల్