‘బ్రో డాడీ’ రీమేక్ లో టిల్లు కాకుండా శర్వా ఎందుకు వచ్చాడు?

మలయాళం సూపర్‌ హిట్ మూవీ బ్రో డాడీ ( Bro Daddy )తెలుగు లో రీమేక్ అవ్వబోతుంది.

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తో ఈ సినిమా రీమేక్ కు సంబంధించిన వర్క్ జరుగుతుంది.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత( Sushmita ) ఈ సినిమాను నిర్మించబోతుంది.

ఇక బ్రో డాడీ సినిమా లో చిరంజీవి తో పాటు డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

"""/" / చిరంజీవి, సిద్దు జొన్నలగడ్డ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు అంటూ ప్రచారం జరిగిన నేపథ్యం లో అంచనాలు భారీగా పెరిగాయి.

సిద్ధు జొన్నలగడ్డ యొక్క నటనతో బ్రో డాడీ రీమేక్‌ కి మంచి హైప్‌ తీసుకు వస్తాడని అంతా భావించారు.

చిరంజీవికి కొడుకు పాత్ర లో భలే సెట్‌ అవుతాడు అని కూడా అనుకున్నారు.

కానీ ఇంతలో ఏమైందో కానీ సిద్దు జొన్నలగడ్డ ప్లేస్ లో శర్వానంద్( Sharwanand ) ను తీసుకునే యోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో శర్వానంద్ కెరీర్ ఆశాజనకంగా లేదు.అందుకే చిరంజీవి సినిమాలో ఆయన్ను నటింపజేస్తే తప్పకుండా అది అతడి కెరీర్‌ కు ప్లస్ అవుతుందని రామ్‌ చరణ్ భావించినట్లుగా ఉన్నాడు.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. """/" / రామ్‌ చరణ్‌( Ram Charan ) కు శర్వానంద్‌ అత్యంత ఆప్త మిత్రుడు.

చాలా సంవత్సరాల క్రితమే శర్వానంద్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయడం కోసం రామ్‌ చరణ్ కష్టపడ్డాడు.

అందుకే ఇప్పుడు కచ్చితంగా రామ్‌ చరణ్ వల్లే డీజే టిల్లు పోయి బ్రో డాడీ లో శర్వా వచ్చి ఉంటాడు అంటూ చాలా మంది భావిస్తున్నారు.

అది ఎంత వరకు నిజమో కానీ బ్రో డాడీ రీమేక్ లో డీజే టిల్లు ఉంటేనే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం.

చిరంజీవికి కొడుకు పాత్ర లో శర్వా అయితేనే సెట్‌ అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఇక హీరోయిన్స్ గా త్రిష ఇంకా శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?