యూఎస్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ మూవీగా ‘బ్రో’.. ఇది రికార్డే!
TeluguStop.com
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ''బ్రో ది అవతార్'' ( Bro The Avatar )ఒకటి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన ఆడియెన్స్ కు జులై 28న ఎదురు చూపులు ఫలించాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''బ్రో''.
ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూసారు.
మరి ఎట్టకేలకు రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.
ఇక ఈ సినిమా అన్ని చోట్ల కలిసి 98 కోట్ల బిజినెస్ చేసుకుని 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
మొదటి రోజు అయితే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. """/" /
ఇక ఇక్కడే కాకుండా పవర్ స్టార్ సినిమాలకు ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.
ఓవర్సీస్ లో ఈసారి కూడా బ్రో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఇక్కడ కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని ప్రీమియర్స్( Premiers ) నుండి మాసివ్ రెస్పాన్స్ లభిస్తుంది.
ఈ సినిమా మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది.అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యుఎస్ లో కలెక్షన్స్ మోత మోగిస్తుంది.
"""/" /
ప్రీమియర్స్ తో పాటు మొదటి రెండు రోజులు యుఎస్ లో కలెక్షన్స్ గట్టిగానే రాబట్టినట్టు తాజాగా అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రేమిఐర్స్ తో పాటు రెండు రోజుల వసూళ్లు కలిసి రికార్డ్ మైల్ స్టోన్ 1 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది.
ఇది ఫాస్టెస్ట్ 1 మిలియన్ల సినిమాల జాబితాలో చేరింది.దీంతో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కెరీర్ లో 1 మిలియన్ డాలర్ చిత్రంగా ఇది నిలిచింది.
హెచ్ 1 బీ వీసా వ్యవస్ధలో భారీ మార్పులు.. ఆ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోకుంటే?